Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సరిహద్దును సందర్శించిన జస్టిస్‌ ఎన్వీ రమణ

అరుదైన రికార్డును నమోదు చేసిన చీఫ్‌ జస్టిస్‌
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అరుదైన గుర్తింపును సంపాదించారు. భారత్‌, పాక్‌ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ తనపేరిట ఓ అరుదైన రికార్డును లిఖించుకున్నారు. గురువారం ఉదయం జస్టిస్‌ ఎన్వీ రమణ వాఘా బోర్డర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ భారత సరిహద్దు రక్షక దళం(బీఎస్‌ఎఫ్‌) గౌరవ వందనాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ స్వీకరించారు. తెలుగు నేలకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. చివరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అత్యున్నత పదవిని అలంకరించారు. సీజేఐగా పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణ.. తాజాగా వాఘా బోర్డర్‌ను సందర్శించిన తొలి సీజేఐగా రికార్డు పుటల్లోకి ఎక్కారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img