Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కామ్రేడ్ చంద్రన్నకు ఘన నివాళి

విశాలాంధ్ర- మద్దిపాడు:సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కమ్యూనిజానికి నాంది పలుకుతూ ఎర్ర సూర్యుడి వలే ఎర్ర జెండాను చేతబట్టి రొమ్ములు నిక్కపరిచే నిక్కచ్చిగా గొంతెత్తిచాటిన ఓ కమ్యూనిస్టువాడా….ప్రపంచం అంతరించే వరకూ బడుగు బలహీన వర్గాల వారి జీవితాలలొ వెలుగులు నింపే ఎర్రని సూరీని వల్లే నిత్యం వెలుగులు వెదజల్లుతూనే ఉంటారని వారు ఆదర్శాలు నిత్యం ఉద్యమం పోరాటాల ద్వారా కొనసాగుతూనే ఉంటాయని రాష్ట్ర ప్రజా నాట్యమండలి గౌరవ అధ్యక్షులు సీపీఐ సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) పేర్కొన్నారు.మ౦గళవారంనాడు మండల పరిధిలోని పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన సీనియర్ సిపిఐ నాయకులు రైతు సంఘం నాయకులు కామ్రేడ్ నల్లూరు చంద్రశేఖర్రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమ౦లొ పలువురు సీపీఐ,సిపిఎం ,టిడిపి పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ప్రముఖులు కామ్రేడ్ నల్లూరి చంద్రశేఖర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా సిపిఐ సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు( అన్న) మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వారియొక్క సమస్యలను జిల్లా పార్టీ దృష్టికి తీసుకువచ్చి వారికి అండగా నిలబడి సమస్యలు పరిష్కరించే వరకు విడనాడె వాడు కాదని అవసరమైతే పార్టీ కార్యాలయంలో నిద్రిస్తానని తప్పక సమస్య పరిష్కరించేవరకు గ్రామానికి వెళ్లానని వాదించేవాడని,పేద, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వారికి రావలసిన ప్రభుత్వ పథకాలు అందేవరకు నిద్రించేవాడు కాదని ఆయన గుర్తు చేశారు. ఉప్పుటూరి ప్రకాశరావు మాట్లాడుతూ కామ్రేడ్ నల్లూరు చంద్రశేఖరరావుతో చిన్నతనం నుంచే తనకు అనుబంధం ఉందని పార్టీ పరంగా ప్రతి ఉద్యమం -ధర్నా నందు చురుగ్గా పాల్గొని పార్టీ నియమావళి ప్రకారంగా పేద బడుగు వర్గాల వారికి అండగా నిలిచే వాడని పెదకొత్తపల్లి నందు సిపిఐ పార్టీకి చంద్రశేఖర్రావు లేనటువంటి లోటు తీరనిదని ఆయన అన్నారు.మద్దిపాడు ఏఎంసీ మాజీ ఛైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు మండవ రంగారావు మాట్లాడుతూ పార్టీలు వేరైనా ప్రజలకు సేవ చేసే విధానంలో ఏ పార్టీ అయినా కూడా ఒకటేనని మనం అన్నదమ్ములు వల్లే మెలగాలని ప్రజల యొక్క బాగు కోసమే మనం పనిచేయాలని ఎంతో ఆప్యాయతగా పలకరించేవారని మంచి మిత్రుడైన కామ్రేడ్ నల్లూరు చంద్రశేఖర్రావును కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని ఆయన అన్నారు. టిడిపి మండలాధ్యక్షులు మండవ జయ౦త్ బాబు మాట్లాడుతూ గతంలో వామపక్షలకు టిడిపికి అన్నదమ్ముల అనుబంధం ఉండేదని ఆ అనుబంధాన్ని కామ్రేడ్ నల్లూరి చంద్రశేఖర్రావు చూపించిన ఆప్యాయత అనురాగాలు కనిపించదని బంధువు అయినప్పటికీ చాలా ఆప్యాయతగా పిలిచేవారని సీపీఐ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పదవులను చేపట్టినప్పటికీ పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి కామ్రేడ్ నల్లూరు చంద్రశేఖర్రావు అని ఆయన అన్నారు. అనంతరం పలువురు ఆయన చిత్ర పటానికి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ , రైతు సంఘం నాయకులు కె. సుబ్బారావు, ఆసరా చైర్మెన్ చిడిపోతు వెంకటేశ్వర్లుఅ౦జయ్య నగర్ సీపీఐ గ్రామ కార్యదర్శి అంగలకుర్తి వెంకటరావు,పెద్దకొత్తపల్లి సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి నల్లజర్ల శ్రీనివాసరావు మరెళ్ల గు౦ టపాలెం సీపీఐ గ్రామ శాఖ సహాయ కార్యదర్శి ఎన్. హనుమంతరావు ప్రజా నాట్యమండలి నాయకులు పావులూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img