Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

విశాలాంధ్ర – ఒంగోలు : ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ పై ఇ. డి. అక్రమ కేసులకు నిరసనగా సత్యాగ్రహ దీక్షనిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధాకర రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ పై ఈడి అక్రమ విచారణను వెంటనే ఆపివేయాలని,ఒక దేశ ప్రతిపక్ష నాయకురాలిని విచారణ చేసే విధానం సరిగా లేదని,ఎటువంటి fir,complaint లేకుండా కేవలం 90 కోట్లు అవినీతి ఆరోపణలు చేసి విచారించడం బీజేపీ,మోడీ సిగ్గుపడాల్సిన విషయమన్నారు. దేశానికి వేలకోట్ల రూపాయలు స్వాతంత్ర్య సాధనకోసం ఖర్చుచేసి, తర్వాత వేల కోట్ల ఆస్తులు దేశానికి అంకితం చేసిన కుటుంబం మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం పై ప్రజలు,ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ నాయకులు కూడా మోడీ చర్యలను అసహ్యించుకుంటున్నారని,ప్రధాని మోడీ ముందుగా లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మోడీ మిత్రులను తెచ్చి విచారించాలని చెప్పారు. ED కేసులను ముందుగా KD లైన మోడీ,అమిత్ షా లపై పెట్టాలని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దేశ అభివృద్ధి కోసం బ్యాంకుల జాతీయకరణ, దేశ సంపదలకు ప్రభుత్వ ఆస్తులు సమకూర్చిన కాంగ్రెస్ పార్టీ.. పై మరియు సోనియా గాంధీ పై అక్రమ కేసులు బనాయించడం తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తున్నామని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నాడు అంటే ఆ ప్రభుత్వ ఆస్తులు సమకూర్చింది అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ డి ఆదినారాయణ రెడ్డి,రాష్ట్ర sc సెల్ ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు,.రాష్ర్ట సేవాదాల్ ఉపాధ్యక్షుడు కొప్పోలు సుబ్బారావు,జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ కే రసూల్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి రవి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు డి సుబ్బారెడ్డి జిల్లా ఆర్ టీ ఐ చైర్మన్ మోషే,జిల్లా సోషల్ మీడియా చైర్మన్ పిల్లి వెంకటేశ్వర రెడ్డి,జిల్లా ఐ ఎన్ టీ యూ సి చైర్మన్ ఉంగరాల శ్రీను,శామ్యూల్, రాష్ట్ర నాయకులు బొడ్డు సతీష్,జోకబ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img