Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మెడికల్ కాలేజ్ కాదు మెడికల్ కిట్ కూడా రాదు

నూజివీడు టౌన్: స్థానిక శాసనసభ్యుడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడుకు మెడికల్ కళాశాల కాదు కనీసం మెడికల్ కిట్టు కూడా తీసుకురాలేరని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు.
ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దరబోయిన మాట్లాడుతూ
ప్రతాప్అప్పారావు తన స్వప్రయోజనాలకు నూజివీడు నియోజకవర్గాన్ని బలి చేస్తున్నారనీ అలాంటి వ్యక్తి వల్ల నూజివీడుకు మెడికల్ కళాశాల కాదుకదా మెడికల్ కిట్ కూడా రాదన్నారు . రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల అభివృద్ధికి అధికార పార్టీ ఎమ్మెల్యేలే పోరాడి పార్లమెంట్ జిల్లా పరిధిలో కాకుండా వేరే జిల్లాల్లో విలీనం అయ్యేందుకు కృషి చేస్తే మన ఎమ్మెల్యే రాజకీయ లబ్ధికోసం కృష్ణా జిల్లా నుంచి నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లా లోకి వెళ్లడానికి పూర్తిగా సహకరించారన్నారు. ప్రతిపక్ష టిడిపి తరపున తాను ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని మార్చవద్దని అనేకసార్లు కోరాన్నారు. ఎమ్మెల్యే చేతకానితనం , అసమర్థత పదవి వ్యామోహంతో నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలిపారు అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న నూజివీడు డివిజన్ స్థాయి నుంచి గ్రామస్థాయికి పడిపోయిందన్నారు.ఇందుకు నూజివీడు డివిజన్ పరిధిలోని వివిధ డివిజన్ కార్యాలయాలు ఏలూరుకు తరలిపోవడమే అన్నారు. నూజివీడు కమర్షియల్ ట్యాక్స్, పంచాయితీరాజ్ , పౌరసంబంధాల శాఖలు తరలిపోయాయ న్నారు. నూజివీడుకు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గాన్ని విలీనం చేయడం వల్ల కేంద్రీయ విశ్వవిద్యాలయం తరలివెళ్లి పోవడానికి కూడా బాధ్యులు అయ్యారన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటి తీసుకొచ్చానన్న ఎమ్మెల్యే ఒక్క విషయం చెప్పాలని ట్రిపుల్ ఐటీ ఏర్పాటు లో మొదటి విడత సేకరించిన భూములు ఎంతకు కొన్నారు, రెండవసారి కొన్న భూముల కు మధ్య విలువలో ఎందుకు తేడా వచ్చింది అనేది నియోజకవర్గ ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని ఈ పరిస్థితుల్లో ట్రిపుల్ఐటీ భూముల కొనుగోలులో వృథాగా చేసిన ఖర్చును వెనక్కి తెస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత స్థానిక శాసనసభ్యులు మేలు చేసినవారవుతారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img