Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

సిబ్బంది సమస్యలకు సత్వర పరిష్కారం : ఎస్పీ మలిక గర్గ్

పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో “పోలీస్ సంక్షేమ దివస్” (గ్రీవెన్స్ డే) ను నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ మరియు విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది వారి యొక్క సస్పెండ్ నుండి రిలీవ్, కుటుంబ సమస్యలు మరియు ఇతర సమస్యలు గురించి ఎస్పీ కి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా సిబ్బంది నుండి అర్జీలను స్వీకరించి, వారి సమస్యల గురించి సమగ్రంగా విని, వాటికి తగిన పరిష్కార మార్గం చూపుతానని వారికి భరోసా కల్పించారు. ఆయా పిర్యాదులపై సంబంధిత డిపిఒ అధికారులతో ఎస్పీ మాట్లాడి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కారించడానికి సంబంధిత అధికారులకు తగిన మార్గదర్శకాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం విధినిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమం ద్వారా సిబ్బంది వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల గురించి తనకు నిర్భయంగా తెలియజేసుకోవచ్చని, సిబ్బంది వారి సమస్యల గురించి జిల్లా పోలీస్ కార్యాలయం చుట్టూ తిరగకుండా, వారి సమయము వృదా కాకుండా ఈ సంక్షేమ దివాస్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ICCR ఇన్స్పెక్టర్ N. శ్రీకాంత్ బాబు మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img