Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఆక్రమితుదారులపై తక్షణమే కేసులు నమోదు చేయండి
సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వ భూములను గుర్తించండి

ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా సహించేది లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎర్రగొండపాలెం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఎర్రగొండపాలెం లో సమగ్ర సర్వే జరిపి ప్రభుత్వం భూములను గుర్తించాలని, ఆ భూముల్లో బోర్డులు పెట్టి స్వాధీనం చేసుకోవాలన్నారు. కొండారెడ్డి కాలనీ వేగనాటి కోటయ్య నగర్ రాళ్లవాగు తదితర ప్రాంతాల్లో అన్యాక్రాంత భూములు గుర్తించాలన్నారు. ఎవరైనా ఆక్రమితుదారులు ప్రభుత్వ భూముల్లో ఉంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా తలోగ్గాలసిన అవసరం లేదన్నారు. ఐదు మండలాల్లోని సర్వేయర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి మూడు వారాల్లోగా ప్రభుత్వ భూముల గుర్తింపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి సురేష్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img