Friday, May 3, 2024
Friday, May 3, 2024

గణేష్ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

నాగులుప్పలపాడు ఎస్సై రమణయ్య

విశాలాంధ్ర నాగులుప్పలపాడు: మండలంలోని ప్రజలు వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై రమణయ్య ఆకాంక్షించారు. మండలంలో కీలకమైన పందిళ్లు, మండపాలు ఏర్పాటు కోసం నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై తెలిపారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్ ఆదేశాల మేరకు.. ఈ నెల 31న వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండల పరిధిలో అన్నీ గ్రామాల ప్రజలు వినాయక విగ్రహాల ఏర్పాటు చేసేవారు కమిటీ సభ్యులుగా ఏర్పడి, స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతులు పొందాలని ఎస్సై రమణయ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు.ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు దారులు అధికారులు నిర్దేశించిన నిబంధనలు మేరకు నడుచుకొని వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే మండపాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహం ప్రతిష్ట నాటి నుండి ఎన్ని రోజులు పాటు పూజలు జరుపుతారో.. నిమజ్జనం కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో.. వంటి పలు అంశాలు పోలీసు వారికి తెలియజేయాలని ఎస్సై కోరారు. ముఖ్యంగా నాగులుప్పలపాడు మండల పరిధిలోని గ్రామాల ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్సై రమణయ్య కోరారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాలు ఏర్పాటు చేసే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img