Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

హైదరాబాద్‌లో నేటి నుంచి న్యూ ట్రాఫిక్‌ రూల్స్‌.. గీత దాటితే వాతే…

హైదరాబాద్‌ మహానగరంలో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. హైదరాబాద్‌ రోడ్లపై ప్రతిరోజు దాదాపు 80 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల చేపట్టిన ఓ సర్వేలో తేలింది. అందులో టూవీలర్‌ వెహికల్స్‌ దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయని తేలింది. సుమారు 14 లక్షల కార్లు నిత్యం రహదారులపై పరుగులు తీస్తున్నాయని తెలిసింది. వాహనాల రద్దీతో నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కిలోమీటర్ల తరబడి రోడ్లపైనే ఉండవలసి వస్తోంది. ఒక్కోసారి వాహనదారులు గంటల తరబడి రహదారులపైనే నిరీక్షిస్తున్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ఉంచటమే ట్రాఫిక్‌ సమస్యలకు కారణమని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ‘ఆపరేషన్‌ రోప్‌’ పేరుతో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనల్లో భాగంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌లైన్‌ దాటితే రూ.100 జరిమానా విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే.. రూ.1000 ఫైన్‌ వేయనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా పుట్‌పాత్‌లపై, రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే రూ.600 ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img