Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణం.. ఆయా రోజుల్లో మూతపడనున్న ఆలయాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లా 12 గంటల పాటు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు. బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అక్టోబర్‌ 25న మంగళవారం సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులుమూసి ఉంచుతారు. అనంతరం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అదేవిధంగా నవంబర్‌ 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గటంలకు శ్రీవారి ఆలయం తలుపులుమూసి ఉంచుతారు. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు. సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంటచేయరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాదభవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్సు ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా తమ తిరుమలయాత్రను రూపొందించుకోవాలని టిటిడి మరోసారి విజ్ఞప్తి చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img