Friday, May 3, 2024
Friday, May 3, 2024

సహకరించిన మండల ప్రజలకు ధన్యవాదాలు : కందుల త్రివేణి

విశాలాంధ్ర` వత్సవాయి: గౌరవ శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఆదేశాలమేరకు ఇచ్చిన పదవి కాల సమయము 5 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండల మహిళా సమాఖ్య అధ్యక్షరాలు పదవికి రాజీనామా చేస్తున్నాను అని కందుల త్రివేణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ, .డ్వాక్రా కుటుంబ సభ్యురాళ్లకు, కార్యాలయం అధికారులకు,సిబ్బందికి, మండలంలోని గ్రామ స్థానిక నాయకులకు ,ప్రతినిధులకు, సహకరించిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు విధినిర్వహణలో ఎవరి మనస్సుని అయిన కష్టపెట్టినట్లు అనిపిస్తే మనసుపూర్తిగా క్షమించాలి అని కోరారు.. రాజకీయాలకు అతీతంగా క్రమశిక్షణతో అవినీతి రహిత పరిపాలన అందించానని అందరి మన్ననలు పొందానని అన్నారు. ఈ పదవి చేయుటకు తనను వెనుక ఉండి నడిపించి తనకు సహకరించిన విమలాభాను ఫౌండేషన్‌ చైర్మన్‌ సామినేని విమలాభాను, యువ నాయకులు సామినేని ప్రసాదు బాబు వత్సవాయి మండల పరిషత్‌ అధ్యక్షులు చెంబేటీ వెంకటేశ్వర రావు, మారేళ్ల సూరారెడ్డి రైతు నాయకులు షేక్‌ సయ్యద్‌ బాబు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్‌ రన్‌ హుస్సేన్‌ పెనుగంచిప్రోలు సర్పంచ్‌ వేల్పుల పద్మకుమారి, వేల్పుల రవి కుమార్‌, గుండం రంగారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. తన ప్రతి కార్యక్రమానికి వెన్నుతట్టి నిరుపేద అయిన తనకు ప్రమాణస్వీకారం మొదలు రాజీనామా వరుకు ఎటువంటి కొరత లేకుండా ఆర్ధికంగా ప్రతి ఖర్చును ఆదుకున్న జయప్రద సేవాసమితి చైర్మన్‌ మాదల జయప్రద చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img