Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పాక్‌లో విస్తరిస్తున్న కరోనా నాలుగో దశ…

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ మేరకు కొవిడ్‌-19 ఆపరేషన్స్‌ కోసం పాకిస్థాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది నేషనల్‌ కమాండ్‌ అండ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ కరోనా నియంత్రణకుగాను నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నాలుగో వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో పాకిస్తాన్‌ ప్రణాళిక మంత్రి అసద్‌ ఉమర్‌ మీడియాతో మాట్లాడుతూ…కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నగరాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతున్నా దృష్ట్యా దేశంలోని ప్రధాన నగరాల్లో ఆంక్షలను పునరుద్ధరించామని అన్నారు. ఆంక్షాలు పునరుద్దరించిన నగరాల జాబితాలో లాహోర్‌, రావల్పిండి, ఇస్లామాబాద్‌, ముజఫరాబాద్‌, మీర్పూర్‌,ఫైసలాబాద్‌, ముల్తాన్‌, పెషావర్‌, కరాచీ, హైదరాబాద్‌, గిల్గిత్‌ ఉన్నాయి. ఆగస్టు 3నుంచి 31వరకు ఈ నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతాయి. ప్రజారవాణా వాహనాల్లో 50 శాతం మందికే అనుమతి ఉంటుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ అమలైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img