Friday, May 3, 2024
Friday, May 3, 2024

స్కూల్‌ భవనంపై నుండి కిందపడ్డ విద్యార్థి.. పరిస్థితి విషమం..

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని నంద్యాల గుడ్‌ షపర్డ్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగింది. వశీకరన్‌ అనే విద్యార్థి స్కూల్‌ భవనంపై నుండి క్రింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు స్కూల్‌ వద్దకు చేరుకొని జరిగిన ఘటనపై ఆందోళన చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img