Friday, May 3, 2024
Friday, May 3, 2024

వలసలు ఆపలేని చేతగాని వైయస్సార్ ప్రభుత్వం

వైయస్సార్ ప్రభుత్వం పాలన దృతరాష్ట్ర పాలనగా ఉంది
శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్

విశాలాంధ్ర – ధర్మవరం : ఏపీలో వలసలు ఆపలేని చేతగాని ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వమని, మీ పాలన ధృతరాష్ట్ర పాలనగా ఉందని,, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలని, మిస్టర్ తోపుదుర్తి నోరు అదుపులో పెట్టుకో… అని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరులతో పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పేరుతో విమర్శించే హక్కు మీకు లేదని ఘాటుగా విమర్శించారు. రామకృష్ణ పై మాట్లాడే ముందు నీ స్థాయి ఏమిటో… తెలుసుకోవాలని, నీవు క్రిమినల్ రికార్డులతో జైలుకు వెళ్లిన చరిత్ర నీదని, (రాప్తాడు ఎమ్మెల్యే) నీ దిగజారుడు రాజకీయాలతో మీ సొంత ఊరికి రోడ్డు వేస్తుంటే అడ్డుపడిన నీవా… మా నాయకుడిని విమర్శించే నైతిక హక్కు నీకు లేదన్నారు. కమ్యూనిస్టులు కేవలం పేద బడుగు బలహీన వర్గాల కోసమే పోరాటాలు చేస్తారని, మీలాగా స్వార్థ రాజకీయాలు చేసి డబ్బులను దండుకోవడం పరమాధికా రాజకీయాలుగా చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్న జిల్లా మన ఉమ్మడి జిల్లాలని, పరిశ్రమలకు సహకరించాల్సిన మీరే అడ్డుకోవడం సబబు కాదని చెప్పడం, మీకు రుచించలేక, ఎక్కడ మీ తప్పులు బయటపడతాయని, దందాలకు అడ్డుగా మాట్లాడుతున్నామని మాపై విమర్శలు చేస్తున్నారా?? అని మండిపడ్డారు. మన జిల్లాలలో పరిశ్రమలు లేక డిగ్రీలు, పీజీలు చేసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతుంటే, ఆపేది పోయి వచ్చిన పరిశ్రమలను కూడా భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరి ఈ జిల్లాలో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేసి ఉంటే వందల ఉద్యోగ అవకాశాలు వచ్చేవని, మీరు ప్రజాసేవకు ,విద్యార్థి యువతకు ఉపయోగపడే పనులు చేయాలని వారు సలహా ఇచ్చారు. స్వార్థ రాజకీయాలు మానుకొని, ప్రజా సంక్షేమంపై దృష్టి సాధించాలని, కమ్యూనిస్టుపై నోరు పారేసుకుంటే., తగిన విధంగా బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జింక చలపతి, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్, సిపిఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి మధు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బయన్న, ధర్మవరం సిపిఐ పట్టణ కార్యదర్శి రవి, చెన్నై కొత్తపల్లి మండల కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img