Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను ఏ ఆర్ టి కేంద్రాల్లో నమోదు చేయాలి

డాక్టర్ కామేశ్వర ప్రసాద్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. కామేశ్వర ప్రసాద్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. యుగంధర్, జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టి. బి. అధికారి డా. అనుపమ జేమ్స్, డా. తిప్పయ్య పాల్గొన్నారు.
డా. కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి. ఉందని నిర్ధారణ అయిన వారి యొక్క భాగస్వాములకు తప్పనిసరిగా హెచ్.ఐ వి. పరీక్షలు నిర్వహించాలని, అలాగే హెచ్.ఐ.వి ఉందని నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరూ ఏ.ఆర్.టి. కేంద్రాలలో నమోదు అయ్యే లాగా ప్రోత్సహించాలని, ఏ.ఆర్.టి. మందులు వాడటం వల్ల ఆరోగ్యంగా జీవనం కొనసాగించ గలరనే విషయం స్పష్టంగా తెలియచేయాలని సూచించారు.
డా. యుగంధర్ మాట్లాడుతూ… వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ఆసుపత్రిలో సేవలు పొందేందుకు వచ్చినవారికి సేవలు అందెలాగ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ డి.పి.యం. వెంకట రత్నం, సూపర్వైజర్ రమణ, మురళి, నారాయణ స్వామి, పూర్వ అనంతపురం జిల్లాలోని అన్ని హెచ్.ఐ.వి. కౌన్సిలర్లు, ఏ.ఆర్.టి. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img