Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పోటీ ప్రపంచానికి తగినట్లుగా విద్యార్థులు అభివృద్ధి చెందాలి

8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన మంత్రి ఉషశ్రీ చరణ్‌
విశాలాంధ్ర/ శెట్టూరు : నేటి తరం విద్యార్థులు పోటీ ప్రపంచానికి తగినట్లుగా విద్యార్థులు అభివృద్ధి చెందాలని అందుకే మన ముఖ్య మంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి సాంకేతిక విద్యను అందించేందుకు విద్యార్థులకు ట్యాబ్‌ లు పంపిణీ చేస్తున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. మంగళవారం ఏపీ మోడల్‌ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి బాల బాలికలకు ప్రభుత్వం అందించిన బైజుస్‌ ట్యాబ్‌ లను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య ను అందించడం కోసం, బైజుస్‌ ద్వారా సాంకేతిక విద్యా విధానాల తో ఈ ట్యాబ్‌ ల ద్వారా విద్యను అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు జగన్‌ విద్యా కానుక, వసతి దీవన, నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్‌, జెడ్పిటిసి మంజునాథ్‌,గ్రామ సర్పంచ్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ కిష్టప్ప,మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ గాయత్రి, కేజీబీవీ ప్రిన్సిపల్‌ లలితమ్మ, జడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌ ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాయల్‌ వెంకటేశం, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మండల స్థాయి అధికారులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img