విశాలాంధ్ర – ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్య గుట్ట వద్ద గల లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీని చైర్మన్ తల్లం నారాయణమూర్తి అండ్ కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీలో అధ్యక్షులుగా శంకరనాయుడు, ఉపాధ్యక్షులుగా మంజునాథ్, కార్యదర్శిగా గుంటప్ప, సంయుక్త కార్యదర్శిగా టి. రామకృష్ణ, కోశాధికారిగా చల్లా చంద్రశేఖర్, డైరెక్టర్లుగా జ్వాలా నరసింహారెడ్డి, ఆంజనేయ చౌదరి, విష్ణు మాయ, తిరుపాలు, కెరీర్ గైడెన్స్ కమిటీగా బి రామకృష్ణ, డి రాంప్రసాద్ తోపాటు ఆత్మీయ సహకార, ఆరోగ్యశాఖ, నైతిక విలువల కమిటీగా, ప్రత్యేక సలహాదారులుగా కమిటీని నియమించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర కమిటీ డైరెక్టర్ కడప జిల్లా కెరియర్ గైడ్ అండ్ చైర్మన్ రాటాల గోపి, కడప నగర కమిటీ కార్యదర్శి సుబ్బారెడ్డి, డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ కడప శివ శంకర్ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీరాం రఘునాథ్, అనంతపురం రీజినల్ చైర్మన్ శీలా జయరామప్ప పాల్గొనడం జరిగిందని తెలిపారు. విశిష్ట అతిధుల చేత ప్రమాణస్వీకారం కూడా చేయించడం జరిగిందని తెలిపారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను పేద ప్రజలకు అందించడంతోపాటు, ధర్మవరం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలను మరింత ఇనుమడింప చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 130 మంది సీనియర్, జూనియర్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
నూతన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ ఏర్పాటు
- Advertisement -
RELATED ARTICLES


