రోటరీ క్లబ్ అధ్యక్షులు బి. జయసింహ
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కోట మున్సిపల్ పాఠశాల యందు నిర్వహించిన ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి పెద్దారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, క్యాంపు చైర్మన్ కలవల మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జయసింహ మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరమునకు దాతలుగా కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం భర్త కలవల మురళీధర్, కుమారులు కలవల నాగతేజ, కోడలు కలవల సర్వాణి, మనవళ్లు మిహాన్ ,దిశాన్ సుకన్య సిల్క్స్ ధర్మవరం వారు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం దాతను ఘనంగా సన్మానించారు. ఈ శిబిరమునకు 119 మంది కంటి రోగులు రాగా అందులో కంటి వైద్య చికిత్సలు అందించిన తర్వాత 87 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ప్రతి శిబిరం దాతల సహాయ సహకారంతో విజయవంతంగా నడిపిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా దాదాపుగా 38 వేల మందికి ఆపరేషన్లు నిర్వహించామని, 50 మంది వరకు రోటరీ క్లబ్ తరఫున నేత్రదానం కూడా నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్, శివయ్య, అసిస్టెంట్ గవర్నర్ నరేందర్ రెడ్డి, రమేష్ బాబు, మనోహర్ గుప్తా, సుదర్శన్ గుప్తా, గట్టు హరినాథ్, వెంకటాచలం, రత్నశేఖర్ రెడ్డి, రామకృష్ణ, సోలిగార్ల వెంకటేశులు, కొండయ్య, శంకర కంటి ఆసుపత్రి వైద్యులు వారి బృందం పాల్గొన్నారు.
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమునకు విశేష స్పందన
- Advertisement -
RELATED ARTICLES


