Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

దేశానికి కొత్త దిశ ఇవ్వగలను…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై నిక్కీ హేలే ఆసక్తి
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధీష్టించే అర్హత తనకున్నదని, సమర్థ నాయకత్వం అందించగలనని, దేశాన్ని కొత్త దిశలో ముందుకు నడిపించగలనని ఇండో`అమెరికన్‌ రిపబ్లిక్‌ నేత నిక్కీ హేల్‌ అన్నారు. ఆమె ఇటీవల ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యానికి కొత్త దిశ ఇవ్వగలనని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడన్‌ మరో అవకాశం ఇవ్వకూడదన్నారు. అవకాశమొస్తే అధ్యక్ష రేసులో నిలుస్తానని చెప్పారు. అందుకోసం తాను కసరత్తు చేస్తున్నట్లు వెల్లడిరచారు. అయితే పోటీపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయనన్నారు. నిక్కీ (51) ఐరాసకు అమెరికా దౌత్యాధికారి, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్‌. భారత సంతతి అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు. అధ్యక్ష పీఠాన్ని అధీష్టించే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వాన్ని చేపట్టగలమా? కొత్త దశలో పయనం సాగించే సామర్థ్యం ఉన్నదా? అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుందని, అవుననే సమాధానం వస్తే అందుకోసం సంసిద్ధం కావడంతో తప్పు లేదని ఆమె అన్నారు. తనపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సమర్థ నాయకురాలిగా దేశానికి కొత్త దిశ ఇవ్వగలనని దీమాగా చెప్పారు. గవర్నర్‌గా, దౌత్యాధికారిగా సమర్థ సేవలు అందించానన్నారు. రెండెంకల నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి గవర్నర్‌ అయి ఆ సమస్య పరిష్కారానికి కృషిచేశా… దౌత్యాధికారిగా ప్రపంచానికి సమర్థ సేవలు అందించా. నన్ను అగౌరవించినప్పుడు కూడా నా సామర్థ్యాన్ని నిరూపించుకున్నా. నేను ఏ రేసులోనూ ఓడిపోలేదు.. ఇప్పుడు కూడా అదే చెబుతాను.. అధ్యక్షురాలిగా రాణించగలననే చెప్పగలను’ అని నిక్కీ అన్నారు. బైడెన్‌కు మరోసారి అధ్యక్షత కట్టబెట్టరాదని ఆమె నొక్కిచెప్పారు. ‘నేను పోటీ చేస్తే… అది బైడెన్‌తోనే… అన్ని అంశాలపై దృష్టిని కేంద్రీకరించా. బైడెన్‌కు మరో పదవీకాలాన్ని ఇవ్వలేం’ అని నిక్కీహేలే అన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024, నవంబరు 5న జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img