Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు…

విశాలాంధ్ర..గుంతకల్లు : గుంతకల్లు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం ఆవరణంలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు చల్లా నాగేంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్‌ ఎం డి గౌస్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సిపిఐ గుంతకల్లు నియోజకవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గణతంత్ర దినోత్సవం ఎంతోమంది ప్రాణ త్యాగాలు అర్పించిన అమరవీరుల చిహ్నంగా ఏర్పడిన ఈ గణతంత్ర దినోత్సవం కానీ నేటికీ బ్రిటిష్‌ చట్టాలను మళ్లీ అవలంబించి రాష్ట్ర ప్రభుత్వం కాలు రాస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉందని తెలిపారు. పూర్తిగా ప్రజల చేతుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాతే వేడుకలు జరుపుకోవడంలో అర్థం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐటియుసి మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర ,సిపిఐ నాయకులు మల్లయ్య మురళీకృష్ణ ,పుల్లయ్య ,ప్రసాద్‌ ,వంశీకృష్ణ, నందు,షబ్బిర్‌ ,దౌలా,నాగేంధ్ర,ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వెంకట్‌ నాయక్‌, వినోద్‌ కుమార్‌, చంద్ర,ట్రాన్స్‌ పోర్ట్‌ హమాలీలు,పాత గుంతకల్లు హమాలీలు,మిల్లు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img