Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ముషారఫ్‌కు తుది వీడ్కోలు

. ముగ్గురు మంత్రుల రాజీనామా
. ఉప ప్రధాని పదవి ఇవ్వకపోవడమే కారణం

ఖాట్మండు: నేపాల్‌లో అధికార కూటమిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు రాష్ట్రీయ స్వంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) ప్రకటించింది. ఇదే క్రమంలో ఆ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. ఉప ప్రధానితో పాటు హోం మంత్రిగా తనను నియమించేందుకు ప్రధాని ప్రచండ నిరాకరించడంతో కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్‌ఎస్పీ పార్టీ చైర్‌పర్సన్‌ రబీ లమిచ్చనె వెల్లడిరచారు. నేపాల్‌ కార్మిక శాఖ మంత్రి డోల్‌ ప్రసాద్‌ అర్యల్‌, విద్య శాఖ మంత్రి శిశిర్‌ ఖనల్‌, ఆరోగ్యశాఖ మంత్రి తోషిమా కర్కి తమ రాజీనామాలిచ్చారు. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో రబీ లమిచ్చనె (48) చిట్వాన్‌`2 నుంచి ఎన్నికయ్యారు. జనవరి 27న సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో శాసనసభ్యత్వాన్ని ఆయన కోల్పోయారు. ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన పౌరసత్వ పత్రం చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇదే క్రమంలో మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్షతకూ ఆయన దూరం కావాల్సి వచ్చింది. నేపాల్‌ పౌరులు మాత్రమే పదవులకు అర్హులు. జనవరి 29న తన పౌరసత్వాన్ని తిరిగి పొందగలిగిన లమిచ్చనె… ప్రచండను కలిసి తన కేబినెట్‌ పదవిని తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు ప్రధాని ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన లమిచ్చనె… ప్రచండ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించారు. గతంలో తనను అణచి వేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని విలేకరులతో అన్నారు.
అయితే తాజా పరిణామంతో ప్రచండకు రాజకీయంగా పెద్దగా నష్టమేమీ ఉండదని, ఆర్‌ఎస్పీ తన మద్దతును ఉపసంహరించుకొని మంత్రులను రీకాల్‌ చేసినాగానీ వారి మద్దతు ప్రభుత్వానికే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img