Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఎల్టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ బతికే ఉన్నాడు.. సంచలన ప్రకటన

దశాబ్దాల పాటు శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడిరచిన ఎల్టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ గురించి సంచలన ప్రకటన వార్తల్లో ప్రధానంగా నిలిచింది. ప్రభాకరన్‌ బతికే ఉన్నాడని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని.. అతి త్వరలో ప్రజల ముందుకు వస్తాడని తమిళార్‌ పెరమైప్పు అధ్యక్షుడు పజా నెడుమారన్‌ ప్రకటించారు. తమిళ ఈలం ప్రజల కోసం త్వరలో ప్రణాళికలు ప్రకటిస్తారని తెలిపారు. ప్రభాకరన్‌ కుటుంబసభ్యులతో తాను టచ్‌లో ఉన్నానని, వారి అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నానని తెలిపారు.
ఎల్టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ గురించి సంచలన వార్త తెరపైకి వచ్చింది. సుమారు 26 ఏళ్ల పాటు శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడిరచిన తమిళ ఈళం నాయకుడు బతికే ఉన్నాడంటూ కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత, తమిళార్‌ పెరమైప్పు అధ్యక్షుడు పజా నెడుమారన్‌ ప్రకటన చేశారు. తమిళనాడులోని తంజావూరులోని ముల్లివైక్కల్‌ ముత్రంలో సోమవారం (ఫిబ్రవరి 13) ఉదయం మీడియా సమావేశంలో నెడుమారన్‌ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ప్రభాకరన్‌ కుటుంబ సభ్యులతో తాను టచ్‌లో ఉన్నానని తెలిపిన నెడుమారన్‌.. వారి కోరిక మేరకే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపారు.‘ఎల్టీటీఈ చీఫ్‌ వేలుపిళ్లై ప్రభాకరన్‌ బతికే ఉన్నారు. అంతేకాదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన త్వరలో ప్రజల ముందుకు వస్తారు. తమిళ ప్రజలకు నేను ఈ శుభవార్త చెబుతున్నందుకు గర్విస్తున్నాను. ప్రభాకరన్‌ విషయంలో ఉన్న అన్ని పుకార్లకు అతి త్వరలో ముగింపు పడుతుందని మేము భావిస్తున్నాం’ అని నెడుమారన్‌ అన్నారు.ఎల్టీటీఈ కార్యకలాపాలకు వ్యతిరేకంగా శ్రీలంక సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ప్రభాకరన్‌ హతమయ్యాడని 2009 మేలో లంక సైన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img