Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సీజనల్ వ్యాధులపై అవగాహన

విశాలాంధ్ర – బొమ్మనహళ్: మండలంలోని మైలాపురం, కొలగణహ ళ్లి గ్రామాలలో బుధవారం వైద్యాధికారి గీత భార్గవి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన డెంగీ,మలేరియా, వైరల్ జ్వరాలు గుర్తించడానికి,ఇంటింటి గృహ దర్శనములు రక్త నమూనాలు , సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల నీ,సాయంకాలం వేళ నీటి డ్ర మ్ములపై మూతలు పెట్టా లని,వారాంకు ఒకసారి డ్రమ్ములు శుభ్రం చేయాలని,కిటికీలకు వైర్ మెస్ లు వేయించుకోవాలని ,రాత్రి వేళల్లో దోమతెరలు వాడాలని ,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్రమ పద్ధతిలో వ్యాధి నిరోధక టీకాలు గర్భవతులు, చిన్నారులకు వేసుకోవాలని, జీవన మనుగడకు ఉపకరిస్తాయని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త వెంకట రమణ, ఆశలు,గిరిజ, నాగమణి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img