Friday, May 3, 2024
Friday, May 3, 2024

బంగ్లాదేశ్‌ నూతన అధ్యక్షుడు షహాబుద్దీన్‌


ఢాకా: బంగ్లాదేశ్‌ 22వ అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి మహమ్మద్‌ షహాబుద్దీన్‌ చుప్పు ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. షహాబుద్దీన్‌ (74) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపింది. షహాబుద్దీన్‌… అవామీ లీగ్‌ సలహా మండలి సభ్యులు. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ స్థానాన్ని భర్తీ చేస్తారు. అధ్యక్ష పదవికి పోటీదారులు లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అబ్దుల్‌ హమీద్‌ రెండవ పదవీ కాలం ఏప్రిల్‌ 23వ తేదీతో ముగియనుంది. బంగ్లాదేశ్‌ రాజ్యాంగం ప్రకారం మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం లేదు. దీంతో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన షహబుద్దీన్‌ చుప్పుకు హమీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. విజయవంతంగా కార్యభారాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. కాగా, షహాబుద్దీన్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన అనంతరం అవినీతి నిరోధక కమిషన్‌కు కమిషనర్లలో ఒకరిగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అవామీ లీగ్‌ సలహా మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img