Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నీటి సరఫరాకి అంతరాయం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో తాగునీటి సరఫరా కాకుండా కొంతమంది వ్యక్తులు నీటి సరఫరా అయ్యే పైపులు లో కీ చెత్త చెదారాన్ని వేసి మూసి వేస్తున్నారని దీనివల్ల గ్రామంలో నీటి సరఫరా తరచూ ఆగిపోతుందని ఈ సంఘటనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ వీరాంజనేయులు, వైసిపి నాయకులు నాగప్ప తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ, బుదగవి గ్రామం నుంచి వెలుగొండ కి సత్య సాయి నీటి సరఫరా అవుతుందని వెలిగొండ గ్రామ సమీపంలో ఉన్న ట్యాంకు వద్ద కొంతమంది వ్యక్తులు జాయింట్ పైపులను తొలగించి పైపుల మధ్యలోకి టెంకాయలు, రాళ్లు తదితర వస్తువులను వేసి తిరిగి పైపులను బిగిస్తున్నారని దీనివల్ల గ్రామంలో నీటి సరఫరా ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. నీటి సరఫరా కాకపోతే గ్రామ సర్పంచ్ వైపల్యం చెందారని ప్రచారాన్ని నిర్వహించేందుకు కొంతమంది వ్యక్తులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. తాగునీటి పైపులలోకి చెత్తను వేయడం వల్ల నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే ఈ సంఘటనకు పాల్పడుతున్న వారిని గుర్తించాలన్నారు. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img