Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ధర్మవరం డివిజన్ ఏఎస్ఓగా లక్ష్మీదేవి బాధ్యతల స్వీకరణ

నిత్య అవసర వస్తువులు ప్రజలకు సకాలంలో డీలర్లు అందించాలి: ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో గల స్టోర్ డీలర్లు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులను సకాలంలో ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న లక్ష్మీదేవిని ధర్మవరం సబ్ డివిజన్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా, ధర్మవరం మండలం సి ఎస్ డి టి గా.. పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆర్డీవో తిప్పే నాయక్ కలిశారు. తదుపరి ఆర్డీవో కార్యాలయ సిబ్బంది ధర్మవరం తహసిల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది లక్ష్మీదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని ఎన్జీ హోమ్ లో సోమవారం నాడు డివిజన్ పరిధిలోని స్టోర్ డీలర్లతో, ఎండి ఆపరేటర్లతో ఆర్డిఓ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పేద ప్రజలకు స్టోర్ డీలర్ల ద్వారా అందిస్తున్న ప్రతి నిత్యావసర సరుకులను సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పదని తెలిపారు. ప్రతినెల స్టోర్ డీలర్లు ఒకటవ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 7:00 కే నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలనీ తెలిపారు. స్టోర్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టోర్ డీలర్ నాయకుడు పరంధామరెడ్డి తో పాటు సబ్ డివిజన్ స్టోర్ డీలర్లు, ఎండి ఆపరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img