Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఉగాది` ఉషస్సులు

వి.యస్‌.ఆర్‌.ఎస్‌.సోమయాజులు సెల్‌: 9441148158 ఆదిగానో అనాదిగానోపండుగలు ప్రాకృతిక జీవనులైన మనుషులకి విశ్వ వ్యాప్తంగా సాంస్కృతిక సంపదలు! గతానుగతాల వర్తమానానికి సంభావిత సూచికలుగా దశ దిశ నిర్దేశనలు కాలచక్రంఅరవై పేర్లు ఆరు ఋతువులుగానాలు ఆరు రుచుల పూత పచ్చడితో పూర్ణ జీవికతలు నమ్మికగా పూనికగా అన్వయ దృక్పథాల్నిస్తుంటాయి
x x x
రాగోదయ సరళిలోంచిఅచ్చర భామ జాణలా తొగరంచుల చీర ధరించి కోర్కెల మనోతావి
క్రొన్నవల ఆశల పురిడిరపులతోఎద కోర్కెల చివుళ్లు ఎర్ర మావి ఇగుళ్లని రహస్య లాస్యాల భావనల్నించి కవి(ల) కూజితాలు మోడైన గ్రీష్మాల్నించి చిగురుటాకులు
ఆశల్ని మోసులెత్తేలా మమతల మావి సుపూతల్ని నవ్వుల్లో రేలుపూలై విరిసేందుకు కుములుతున్న
కడు పేదల బతుకుల్లోఎర్రెర్రని మోదుగుల వికసనం అపసవ్యతలుండని ఆర్దాక్షరాల్నిఅర్థవంతంగా సంతసాన్నిచ్చే రాజ్యపూజ్యావమానాలు నీరసాన్నిచ్చే ఆదాయ అవమాన వ్యయాలు యిలా ఎన్నెన్నో కాంక్షాభరిత ఆవిష్కరణలు జీవన గమనాల పునర్‌ మూల్యాంకనలు కొనసాగాల్సిందే!

అలా ప్రతి వార్షిక గానాల్లోనూ ఆధునిక జగత్తులోకి అలౌకికానందాలు
వెంపర్లాటలు` ప్రేమాభిమానాల అంతరంగాల్లో
ముసురుకున్న చీకట్లని తొలగించే వెలుగులు
శోభిల్లతల్ని విస్తరించే ప్రాకృతిక ఉషస్సులు!!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img