Friday, May 3, 2024
Friday, May 3, 2024

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గంలో వివిధ మండలాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి రూ.9 లక్షల చెక్కులను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మంగళవారం ఉరవకొండ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనేక పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తోందన్నారు.అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img