Friday, May 3, 2024
Friday, May 3, 2024

నైతిక విలువలతో విద్యను బోధిస్తున్న శ్రీ వాణి విద్యానికేతన్

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో ఉన్న శ్రీ వాణి విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధిస్తోందని అనేకమంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ పాఠశాలలో చదవడం హర్షనీయమని మాజీ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ఎస్. తిప్పయ్య, విశ్రాంత బ్యాంకు మేనేజర్ సి. ఓబులేసు, పెన్నహోబిలం ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ కుమార్ లు పేర్కొన్నారు. శనివారం స్థానిక పాఠశాల ఆవరణలో జరిగిన సరస్వతి పూజ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు వీరు అనేక సలహాలు సూచనలను ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు పరీక్షల సామగ్రిని అందజేశారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని తల్లిదండ్రులు మరియు పాఠశాల యొక్క పేరు ప్రతిష్టలు పెంచే విధంగా అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉరవకొండ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ ప్రసాద్, పాఠశాల కరస్పాండెంట్ రఘు రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img