Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శిక్షణా కార్యక్రమాలను ప్రారంభం చేసిన డివిజనల్ పంచాయతీ అధికారి

విశాలాంధ్ర, సీతానగరం: మండల కేంద్రం లోని పెదభోగిలి‌ చెత్తనుండి సంపద తయారీ కేంద్రంలో రెండురోజుల శిక్షణా కార్యక్రమంను పార్వతీపురం డివిజనల్ పంచాయతీ అదీకారి దేవకుమార్ ప్రారంభం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా పంచాయతీలలో నిర్మాణం జరిగిన ఎస్ డబ్లూ పి సి షెడ్లనందు ప్రతీగ్రామంలో ప్రతీ ఇంటినుండి సేకరించిన తడిచెత్త, పొడి చెత్తను వేరుచేసి వర్మీకంపోస్టు తయారు చేయడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరడంతో పాటు గ్రామ ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించగలమని చెప్పారు. ఎంపిడిఓ కృష్ణ మహేష్ రెడ్డి మాటాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సిబ్బంది పంచాయతీ బాడి సహకారంతో కృషి చేయాలన్నారు.నేటిశిక్షణ అందుకు దోహదపడేట్టు ఉండాలని కోరారు. ఈఓపిఆర్డీ వర్మ మాటాడుతూ ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించేందుకు అందరం కృషి చేయాలని కోరారు.ఈశిక్షణలో తెలుసుకున్న విషయాలను ఆచరణలో చూపాలని కోరారు. ఈకార్యక్రమంలో సీతానగరం మండల పరిషత్ అధ్యక్షురాలు బలగ రవణమ్మ, సర్పంచ్ జొన్నాడ తేరీజమ్మ, ఎంపీటీసీలు సురగాలి గౌరి, కుసుమం శ్రీ కుమారి,ఉపసర్పంచ్ కె అరవింద్, ఈఓ వెంకటరావు, సెక్రటరీ సుధారాణి మరియు వివిధగ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img