Friday, May 3, 2024
Friday, May 3, 2024

రమ్య హత్యకేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి

గుంటూరు దుర్ఘటనపై మహిళా విద్యార్థి, యువజన సంఘాల నిరసన విశాలాంధ్రవిజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవ వేళ పట్టపగలు గుంటూరు నగరంలో విద్యార్థిని రమ్యను దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రమ్య హత్యను ఖండిస్తూ సోమవారం ఉదయం స్థానిక హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌ వద్ద మహిళ, విద్యార్థి, యువజన సమాఖ్యల ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం నిర్వహించారు. పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నా నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మృతుల కుటుంబాలకు హడావుడిగా రూ.10 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరుగకుండా చూడాలని, చట్టాలను మరింత కఠనతరం చేరయాలని పేర్కొన్నారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్‌బాబు మాట్లాడుతూ అత్యాచారం, హత్య ఘటనలు జరిగినప్పుడు బాధితులు తీవ్ర భయాందోళనలకు గురవుతూ దిశ యాప్‌ వినియోగం గురించి ఆలోచన చేయలేరని, దిశ, నిర్భయ వంటి చట్టాలను మరింత కఠినతరం చేయాలన్నారు. నిందితులకు సత్వరమే కఠిన శిక్షలు విధించడం ద్వారా మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పమిడిముక్కల రాణి, నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, మహిళా సమాఖ్య నాయకులు, డి. సీతారావమ్మ, తమ్మిన దుర్గ, దుర్గాసి రమణమ్మ, బీసు శాంతమ్మ, పుష్పావతి, షకీలా, ఆర్‌.సుజాత, వరలక్ష్మి, యువజన సమాఖ్య మాజీ నాయకుడు మోతుకూరి అరుణకుమార్‌, విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మందగళ్ల సాయికుమార్‌, చరణ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img