Friday, May 3, 2024
Friday, May 3, 2024

పట్టు బిగించిన పర్వతనేని…!

పోటా పోటీగా జనసమీకరణ
టిడిపి శ్రేణులలో నూతన ఉత్సాహం
విశాలాంధ్ర -చాట్రాయి
: తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూజివీడులో నిర్వహించినరోడ్ షో ,బహిరంగ సభలో నియోజకవర్గ నాయకులు పోటాపోటీగా బలప్రదర్శన చేయగా పర్వతనేని గంగాధర్ అగ్రభాగాన నిలిచారని టిడిపి శ్రేణులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలతో ఎవరికివారే యమునా తీరేగా ఉన్న దశలో చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో నూజివీడు లో శుక్రవారం సాయంత్రం సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.షుమారు 11 నెలల క్రితం చంద్రబాబు సభ ఆగిరిపల్లి లో రచ్చబండ సభ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్య నాయకులను చంద్రబాబు వద్దకు వెళ్ళనివ్వలేదనిదానితో విబేధాలు బగ్గుమన్న విషయం తెలిసినదే . విభేదాలు ఎన్ని ఉన్నా సీటు ఎవరిది అనే దానిపై రోజువారి పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన పర్వతనేని గంగాధర్ పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు నిధులు ఖర్చు పెట్టి పదివేలమంది కి పైగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ మొత్తం నుండి బైక్ లు, ఆటోలపై ఊరూరా కార్యకర్తలను పెద్ద ఎత్తున నూజివీడు కి వేలాది మందిని సమీకరించారని పలువురు అంటున్నారు.తగ్గేదెలా అంటూ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసారు. నియోజకవర్గంలో గడచిన నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉన్న మాజీ ఎఎంసి చైర్మన్ కాపా శ్రీనివాసరావు వెయ్యికి పైగా మోటార్ సైకిల్ తో నూజివీడు రాజీవ్ సర్కిల్ వద్ద నుంచి మర్రిబంధం వరకూ బాహుబలి లా తన బలగం తో భారీ ప్రదర్శన చేసి చంద్రబాబు కి స్వాగతం పలికి తనముద్ర వేసారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన శక్తిని మొత్తం కూడగట్టుకుని జనసమీకరణ చేశారు. సుధీర్ఘ కాలం తర్వాత చంద్రబాబు రాకతో నియోజకవర్గ కేంద్రంలో పెద్ద సభ జరిగింది.టిడిపి శ్రేణులలో ఆనందానికి అవధులు లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img