Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మే 1 నుంచి కొత్త వేతనాలు

ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వుల జారీ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రకటనలోఎంపికైన వారికి పొబ్రేషన్‌ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీజేసింది. రెండేళ్ల సర్వీసు పూర్తితోపాటు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రొబేషన్‌ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ స్పష్టం చేశారు. వారందరికీ ఈ ఏడాది మే 1 నుంచి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయి. నవరత్నాల విధానంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 విభాగాల ఉద్యోగాలను రాత పరీక్ష ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ ప్రొబేషన్‌ అమలు చేయాలంటూ అన్ని విభాగాల శాఖాధిపతులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీజేశారు. ప్రొబేషన్‌ పొందబోయే గ్రామ, వార్డు సచివాల యాలకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగుల పే స్కేళ్ల వివరాలిలా ఉన్నాయి.
నంబరు హోదా పే స్కేల్‌
1. పంచాయతి సెక్రటరీ గ్రేడ్‌5 రూ.2312074770
2. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్‌6)
డిజిటల్‌ అసిస్టెంట్‌ రూ.2246072810 3. వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ రూ.2246072810
4. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌2 రూ.2246072810
5. విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ రూ.2246072810 6. విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ రూ.2246072810
7. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ రూ.2246072810 8. విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ రూ.2246072810
9. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌2) రూ.2246072810
10. విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (గ్రేడ్‌2)/ వార్డు రెవెన్యూ సెక్రటరీ రూ.2246072810
11. విలేజ్‌ సర్వేయర్‌ (గ్రేడ్‌3) రూ.2246072810
12. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ రూ.2312074770 13. వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ (గ్రేడ్‌2) రూ.2246072810 14. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ(గ్రేడ్‌2) రూ.2246072810 15. వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డాటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ రూ.2246072810
16. వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డవలప్‌మెంట్‌
సెక్రటరీ(గ్రేడ్‌2) రూ.2246072810
17. వార్డు అమెనైటీస్‌ సెక్రటరీ (గ్రేడ్‌2) రూ.2246072810
18. ఏఎన్‌ఎం(గ్రేడ్‌3)/వార్డు హెల్త్‌ సెక్రటరీ రూ.2246072810
19. గ్రామ/వార్డు మహిళా సంరక్షణ
కార్యదర్శి (గ్రేడ్‌3) రూ.2246072810

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img