Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

హెలికాప్టర్ సాంకేతిక లోపం ఎఫెక్ట్, ఇంటర్ ఫలితాలు గంట ఆలస్యం

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు గంట ఆలస్యంగా వెలువడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో బొత్స వెంటే ఉన్నారు. జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో వీరు రోడ్డు మార్గాన పుట్టపర్తి చేరుకొని, అనంతరం గన్నవరం చేరుకోనున్నారు. వారు రోడ్డు మార్గాన ప్రయాణించి రావడంతో సాయంత్రం ఐదు గంటల వరకు మంత్రి బొత్స విజయవాడకు చేరుకునే అవకాశం లేదు. దీంతో ఫలితాలను సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. విద్యార్థులు పఱవaజూ.aజూషటంం.ఱఅ. aజూ. అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోను ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img