Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రైవేటీకరణ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలి

విశాలాంధ్ర-రాప్తాడు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని బుధవారం ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వామపక్ష నాయకులను ఇటుకపల్లి సర్కిల్ సీఐ మోహన్, ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి అరెస్టు చేసి రాప్తాడు స్టేషనుకు తరలించారు. వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై సీఎం కేంద్ర పెద్దలతో మాట్లాడాలన్నారు. జగన్‌ ఢిల్లీ వెళితే ఈసారి అఖిలపక్ష నాయకుల్ని తీసుకువెళ్లాలని డిమాండ్‌ చేశారు. గతంలో అనేకమార్లు కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చూస్తే నాటి ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కనీసం బాధ్యత కూడా తీసుకోవడం లేదన్నారు. అందరూ కలిసికట్టుగా ఆందోళనల ద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా కలిసి పోరాడకుంటే రాష్ట్ర ప్రజలు రాజకీయ నేతల్ని నమ్మరన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమిళనాడు తరహాలో ఐక్యపోరాటాలకు అన్ని పక్షాలు ఏకం కావాలన్నారు. ప్రైవేటీకరణ ఆపే వరకు వెనక్కు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి గౌని శారద, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు జి. దుర్గాప్రసాద్, మండల సహాయ కార్యదర్శి ఎం. చలపతి, సీపీఎం మండల కార్యదర్శి పోతులయ్య, నారాయణస్వామి, బాషా, ఖాదర్ భాషా, పాపమ్మ, దేవీ, లక్ష్మి, రామక్క, లక్ష్మిదేవి, ముత్యాలక్క తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img