Friday, May 3, 2024
Friday, May 3, 2024

శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో కృషి : డీఎస్పీ వెంకటశివారెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : శాంతి భద్రతలు పరిరక్షణకు సమన్వయంతో కృషి చేస్తానని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు. బుధవారం రాప్తాడులో సబ్ డివిజన్ కార్యాలయం ప్రారంభించడంతోపాటు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన సబ్‌ డివిజన్‌లోని పరిధిలోని ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్, నార్పల, శింగనమల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా కృషిచేస్తానన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలైన పేకాట, కోడిపందాలు, నాటుసారా నిర్మూలన, అక్రమ ఇసుక రవాణా, నిషేధిత గుట్కా, మహిళల భద్రత, మహిళా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని వివరించారు. ప్రతి మహిళా దిశ యాప్‌ వినియోగించు కోవడం వంటి విషయాలపై ప్రత్యేక దష్టి సారిస్తానన్నారు, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, వాహన డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, వాహన చోదకులకు వాహనాల వినియోగంపై, రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించేలా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను తరచూ సందర్శించి అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు పాటుపడతామన్నారు. గ్రామాల్లో రాత్రివేళల్లో తమ సిబ్బందితో పల్లెనిద్ర చేయడానికి శ్రీకారం చుట్టి తద్వారా అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాద నివారణకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి అపరాధ రుసుం విధిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు సూచించేలా ప్రధాన సర్కిళ్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలి వెళ్తున్నాయని వాటిపై పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. వైద్యం, పోలీసు, ఆగ్నిమాపక, మహిళ భద్రత ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎవరైనా అప్పుడు 112 నంబర్‌కు దయచేసి సాయం పొందాలని కోరారు. అనంతరం సీఐలు మోహన్, విజయభాస్కర్ గౌడ్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు డీఎస్పీ వెంకట శివారెడ్డిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img