Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూత

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు కొద్ది సేపటి క్రితం హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. 1974లో రామరాజ్యం సినిమాలో హీరోగా పరిచయమై వచ్చిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అనే సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. సత్యన్నారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబకులు సత్యం బాబుగా పిలుస్తారు. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు పొందిన శరత్ బాబు మృతి చెందడం ఆముదాలవలస లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img