Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గాడి తప్పిన తమిళనాడు గవర్నర్‌

గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధులు అన్న మాటకు అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు. అయితే చాలా మంది గవర్నర్లు ఇటీవలి కాలంలో తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టడం కోసం కాచుకుని కూర్చుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఉన్నతాధికారిగా ఉండి ప్రస్తుతం తమిళ నాడు గవర్నర్‌గా ఉన్న ఆర్‌.ఎన్‌.రవి మరో రెండాకులు ఎక్కువ చదివినట్టున్నారు. ఏకంగా స్టాలిన్‌ మంత్రివర్గ సభ్యుడైన సెంతిల్‌ బాలాజీని గురువారం బర్తరఫ్‌ చేశారు. అయితే అయిదు గంటలలోగా ఈ బర్తరఫ్‌ను తానే నిలిపివేశారు. రవి అనుసరించిన ఈ వైఖరి రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పడానికి పండితులు కావలసిన అవసరంలేదు. ఉద్యోగాలివ్వడానికి డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలతో పాటు బాలాజీ మీద అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన మీద ఉన్న నేరపూరిత కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది కనక బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ రవి నిర్ణయించేశారు. బాలాజీ మీద ఎన్ని ఆరోపణలైనా ఉండొచ్చు. అవన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి కనక ఏ చట్టం దృష్టిలోనూ ఆయనను నేరస్థుడిగా పరిగణించడానికి వీలులేదు. అదీ కాకుండా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మాట మాత్రమైనా చెప్పకుండా బర్తరఫ్‌ చేయాలని నిర్ణయించేశారు. వెంటనే ఉత్తర్వూ జారీచేశారు. ఏ రాష్ట్ర గవర్నర్‌ అయినా ఆ రాష్ట్రానికి నామమాత్రమైన అధినేతే. రాష్ట్రపతి, గవర్నర్లు కూడా మంత్రివర్గం సలహా మేరకే నడుచుకోవాలన్న రాజ్యాంగ సూత్రాన్ని రవి ఖాతరు చేయకపోవడం దారుణం. స్వతంత్రంగా పాలనాపరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు లేదు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ విషయంలో న్యాయనిపుణుల అభిప్రాయం తెలుసు కుని ఉండాల్సిందని అనడం వల్ల బర్తరఫ్‌ ఉత్తర్వును ఆపేశారు. చట్ట ప్రకారం చూస్తే బర్తరఫ్‌ ఉత్తర్వును నిలిపివేయడమే కాదు సంపూర్ణంగా ఉపసంహరించుకోవాల్సిందే. బర్తరఫ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులోని రెండవ వాక్యమే బాలాజీపై నిరాధార ఆరోపణలతో నిండి ఉంది. ఆయన తన మీద ఉన్న కేసుల దర్యాప్తును అడ్డుకుంటున్నారని గవర్నర్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఒక వేళ సదరు మంత్రి ఆ పనిచేసి ఉన్నా ఆధారాలు చూపవలసిన కనీస బాధ్యతను కూడా రవి నిర్వర్తించలేదు. ఒక వేళ గవర్నరుకు దగ్గర ఆ మంత్రి దర్యాప్తును అడ్డుకుంటున్నారన్న సమాచారం ఉండి ఉంటే దాన్నీ బయట పెట్టాల్సింది. ఆ పనీ చేయలేదు. తన కార్యాలయానికి అలాంటి సమాచారం అందినట్టు కూడా చెప్పలేదు. నిజానికి విషయం తేలేదాకా ఇవన్నీ బయట పెట్టకుండా ఉండవలసిన అంశాలే. మంత్రి బాలాజీ ప్రస్తుతం ఆయన మీద ఉన్న కేసుల్లో భాగంగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ ఆయన మీద మోపిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలన్న కనీస జాగ్రత్త కూడా గవర్నర్‌ రవి తీసుకోక పోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని బర్తరఫ్‌ చేయడం బహుశ: ఇదే మొదటిసారి కావచ్చు. ఇలాంటి ఏకపక్ష, విపరీత చర్యలు రాజ్యాంగ సమ్మతమూ కావు. ఈ కీలకాంశాలను పట్టించుకోకుండా ఆరోపణలున్న మంత్రి బాలాజీ మంత్రివర్గంలో కొన సాగడం అంటే చట్టం పనిచేయడానికి ఆటంకం కలిగించడమేనన్న నిర్ధారణకు గవర్నర్‌ ఎలా వచ్చారో తెలియదు. బాలాజీ మంత్రివర్గంలో కొనసాగడంవల్ల రాజ్యాంగ యంత్రాంగానికి భంగం కలుగుతుందని కూడా గవర్నర్‌ నిర్ధారణకు వచ్చేశారు. గవర్నర్‌ విశ్వాసం చూరగొన్నన్నాళ్లే ఎవరైనా మంత్రివర్గంలో కొనసాగాలి అన్నది రాజ్యాంగ నిర్దేశం. అయితే గవర్నర్‌ విశ్వాసం చూరగొంటున్నారా లేదా అన్నది గవర్నర్‌ సొంత అభిప్రాయం మీద ఆధారపడిన విషయం కాదు. గవర్నర్‌ కేవలం అనుమానం వ్యక్తం చేయలేదు. తాను ఊహించుకున్న అంశాలు సంపూర్ణ సత్యమని నమ్మేశారు. బాలాజీ ఇప్పటికే జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు కనక ఊహా పోహాలకు తావు ఉండకూడదు. కేసు తేలేదాకా వేచి ఉండే ఓరిమి గవర్నరుకు లేకుండా పోయింది.
రాజ్యాంగ యంత్రాంగం దెబ్బతినే పరిస్థితి వస్తే రాష్ట్రపతి పాలన విధించవలసి వస్తుందని రాజ్యాంగం గురించి కనీస అవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. గవర్నర్‌ స్థానంలోఉన్న వారికి కచ్చితంగా తెలియాలి. లేకపోతే మంత్రి బాలాజీని బర్తరఫ్‌ చేయడంవల్ల రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయ్యే దశను నివారిస్తున్నానని, రాష్ట్రపతి పాలన విధించకుండా చేస్తున్నానని అయినా గవర్నర్‌ భావించి ఉండాలి. స్వీయ మానసిక ధోరణితో గవర్నర్లు వ్యవహరించడం విపరీత చర్యేకాదు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకపోవడం. ఆ మాటకు వస్తే రాజ్యాంగాన్ని లెక్కచేయక పోవడమే. గవర్నర్‌ కేవలం తన ఊహ ఆధారంగా బర్తరఫ్‌ చేసినట్టే. రాజ్యాంగ యంత్రాంగం విఫలమయ్యే ప్రమాదం ఉందన్నది గవర్నర్‌ సొంత ఆలోచనలోంచి పుట్టిన అభిప్రాయమే తప్ప చట్టంతోనూ, రాజ్యాంగం తోనూ ఎంతమాత్రం నిమిత్తంలేదు. రాజ్యాంగ యంత్రాంగం విఫలమవు తోందని భావించినా గవర్నర్‌ తన విచక్షణాధికారాలను వినియోగించే అవకాశంలేదు. రాజ్యాంగ యంత్రాంగం విఫలంఅవుతోంది అన్నది గవర్నర్‌ సొంత అభిప్రాయం అయితే అదీ చట్టబద్ధమైంది కానే కాదు. గవర్నర్‌ విచక్షణాధికారాల గురించి సుప్రీంకోర్టులో ఇదివరకే ప్రస్తావనకు వచ్చింది. గవర్నరుకు అలాంటి అభిప్రాయం కలిగితే శాసనసభ సమావేశం ఏర్పాటు చేయించాలి. లేదా సభను ప్రొరోగ్‌చేయాలి. అదికూడా ముఖ్య మంత్రి సలహా మేరకే జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ నిర్ణయం ఏ గవర్నరూ సొంతంగా తీసుకోవడానికి వీలులేదు. మంత్రులను ఏక పక్షంగా బర్తరఫ్‌చేయడం విచక్షణాధికారాల కిందకురాదు. ముఖ్యమంత్రి సలహా ఇస్తేతప్ప ఏ మంత్రినీ గవర్నర్‌ బర్తరఫ్‌ చేయకూడదు. అది రాజ్యాంగ నియమం. దేశప్రయోజనాలకు ఏది సబబైంది, ఏది కాదు అన్న విచక్షణాధి కారాన్ని కూడా రాజ్యాంగం ఇవ్వలేదు.
ఒక మంత్రిని బర్తరఫ్‌ చేయడం అవసరమని గవర్నర్‌ భావిస్తే ఆ విషయం ముందు రాష్ట్రపతికి నివేదించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గవర్నర్‌ రాజ్యాంగసూత్రాలకు, చట్టాలకు, నిబంధనలకు లోబడి పనిచేయా ల్సిందే. బర్తరఫ్‌ చేయాలని మొదట నిర్ణయించుకున్నప్పుడు గవర్నర్‌ రవి నిర్వహించని విధి ఇదే. ఒక మంత్రిమీద తనకు విశ్వాసం లేదని గవర్నర్‌ భావించినట్టయితే ఆ విషయం ముఖ్యమంత్రికి తెలియజేసి ఆయన సలహా మేరకు నడుచుకోవాలి. ఇవేవీ గవర్నర్‌ రవికి పట్టిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్‌ నడుచుకోవాలన్న నియమాన్ని ఉల్లంఘించి రవి చాలాదూరం వెళ్లి పోయారు. రాజకీయప్రాపకంవల్ల గవర్నర్లనుంచి ఇంతకన్నా ఏమీ ఆశించలేం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img