Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

స్వాజిలాండ్‌లో రాచరిక పాలనపై నిరసన

స్వాజిలాండ్‌ : దక్షిణాఫ్రికా ఖండ దేశమైన స్వాజిలాండ్‌లో రాచరిక పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. నిరసన కారులపై రాయల్‌ పోలీసులు దౌర్జన్యకాండకు పూనుకున్నారు. తాజా దాడిని ఖండిస్తూ స్వాజిలాండ్‌ కమ్యూనిస్టు పార్టీ (సీసీఎస్‌) జనరల్‌ సెక్రటరీ తోకోజనే కునేన్‌ మాట్లాడుతూ సైనికులు జవాబు దారీ తనం లేకుండా ప్రజలపై దాడి చేయడానికి అపరిమిత అధికారాలు ఇవ్వడంతో దేశ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం ఏకం కావాలి అని కోరారు. స్వాజిలాండ్‌లోని షినెల్‌వేని ప్రాంతంలో జరిగిన ఈ నిరసనకాండను రాయల్‌ పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నిం చడంతో ఆ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. మాంబా అనే పోలీసులు యువకుడిని మంటల్లోకి తోయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. సైనికుల చర్యకు నిరసనగా ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. కాలిన శరీరంతో మాంబా చికిత్సకోసం దగ్గరలోని ఆసు పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రజల దృష్టిలో జరిగిన దాడిని కప్పిపుచ్చేం దుకు రాయల్‌ పోలీసులు, సైన్యం విఫలయత్నం చేశారు. దేశంలో జూన్‌ నుండి రాచరిక వ్యవస్థకు నిరసనగా జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నవారిలో 600 మందిని అరెస్టు చేశారు. ఈ ఘర్షణల్లో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రజాస్వామ్య పోరాటంలో ప్రజలంతా ఏకం కావాలని స్వాజి లాండ్‌ కమ్యూనిస్టు పార్టీ కోరింది. స్వాజిలాండ్‌ ప్రజల తరఫున అంతర్జాతీయ సంఫీుభావం కోసం స్వాజిలాండ్‌ కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img