ముంబై: భారతదేశంలోని ప్రముఖ వెల్నెస్ బ్రాండ్‌లో ఒకటైన హిమాలయ వెల్నెస్ కంపెనీ, తమ బేబీ కేర్ రేంజ్ క్రీమ్ క్లెన్సింగ్ బేబీ బార్కి పీహెచ్ 5.5తో, కొబ్బరి పాల ప్రోటీన్, ఇతర సహజ పదార్ధాల మిశ్రమం పోషకాలతో సుసంపన్నమైన కొత్త జోడిరపుతో విడుదల చేశామని ప్రకటించింది. బేబీ బార్‌ను ప్రత్యేకంగా నవజాత శిశువులు, సున్నితమైన చర్మం కలిగిన శిశువుల కోసం 5.5 పీహెచ్ బ్యాలెన్స్‌తో రూపొందించగా, ఇది 100% సబ్బు రహితంగా ఉంటుంది. సహజమైన మాయిశ్చరైజర్ల (హెర్బ్-ఆయిల్-బటర్ కాంప్లెక్స్) సుగుణాలు శిశువు స్నానం చేసిన తర్వాత చర్మానికి పోషణ, రక్షణ, తేమను అందించడంలో సహాయపడుతుంది. విడుదల సందర్భంలో హిమాలయా వెల్నెస్ కంపెనీ బేబీకేర్ విభాగం డైరెక్టర్ చక్రవర్తి ఎన్.వి. మాట్లాడుతూ, పిల్లల పట్ల గాఢమైన ప్రేమతో, తమ బేబీ పర్సనల్ కేర్ ఉత్పత్తుల శ్రేణికి సరికొత్త జోడిరపు క్రీం క్లెన్సింగ్ బేబీ బార్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు.