హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) 2023 -24 నాటికి అదనంగా మరో 10,000 మంది కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖతో తమ అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు, హెచ్‌సిసిబి, తెలంగాణ ప్రభుత్వం కలిసి 2022లో తమ భాగస్వామ్య మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 10196 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి సి హెచ్ మల్లారెడ్డి సమక్షంలో హెచ్‌సిసిబి, తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్ర అధికారులు డాక్టర్ జయేష్ రంజన్, శ్రీకాంత్ సిన్హా, హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ చీఫ్ పబ్లిక్ అఫైర్స్ హిమాన్షు ప్రియదర్శి, హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ హెడ్-హెచ్ఆర్ చిత్ర గుప్తా పాల్గొన్నారు.