Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్‌ లక్షలాదిమంది నిరసన

పారిస్‌ : ఆరోగ్య రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఫ్రాన్స్‌ ప్రజలు నిరసన చేపట్టారు. నిరసనల్లో 1.60 లక్షలమంది మంది పాల్గొన్నారు. దేశంలో కోవిడ్‌ హెల్త్‌పాస్‌ విధానంపై ప్రజలు ఆగ్రహం వక్తం చేశారు. కోవిడ్‌ నిరసనల్లో భాగంగా వరుసగా ఏడవ వారం దేశంలో ఆందోళన ఊపందుకుంది. కరోనాకు ముందే ఫ్రాన్స్‌లో ఆరోగ్య వ్యవస్థ కుంటుపడిరది. దేశ బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి కేటాయింపులను గణనీయంగా తగ్గించింది. మేము ప్రయోగశాలల్లో ఎలుకలం కాదని 11ఏళ్ల బాలుడు వ్యాఖ్యానించాడు. ఆసుపత్రిలో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. బెడ్‌ల కొరత, ప్రభుత్వాసుపత్రుల మూసివేతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ కాలంలో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ప్రజారోగ్య వ్యవస్థ చచ్చుబడిపోయింది. మాక్రాన్‌ ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలు, కార్మిక వ్యతిరేకత, పెన్షన్‌ సంస్కరణలో లోటుపాట్లు, కోవిడ్‌ హెల్త్‌ పాస్‌ విధానాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. దీనితో విసిగిన ప్రజలు ఈ నెల 4నుండి ఫ్రాన్స్‌లో దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. వేతనాలకు కోవిడ్‌ హెల్త్‌పాస్‌లు ముడిపెట్టడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హెల్త్‌పాస్‌లో వాక్సిన్‌ వివరాలు తెలియజేసే క్యుఆర్‌కోడ్‌ ఉంటుంది. ప్రజారవాణా సంస్థలు, సినిమాలు, కేఫలలో ఈ పాస్‌ తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించని ఉద్యోగులపై వేతనాల నిలుపుదల ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img