Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎన్నికా… ఏకగ్రీవమా ?

. రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ
. నామినేషన్లకు మూడు రోజులే గడువు
. టీడీపీ నిర్ణయంపై ఉత్కంఠ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో టీడీపీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సంద ర్భంగా అవసరమైన బలం లేకున్నా టీడీపీ అభ్యర్థి ఊహించని విధంగా విజయం సాధించడంతో మరలా ఆ పరిస్థితి పునరావృతమవుతుందే మోనన్న భావన రాజకీయవర్గాల్లో నెలకొంది. ఏపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనుంది. దీంతో దేశవ్యాప్తంగా అదే తేదీకి ఖాళీ కానున్న 56 స్థానాల భర్తీలో భాగంగా ఏపీలో మూడు స్థానాలకు ఈనెల 8వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్‌, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్‌ పదవీకాలం పూర్తవుతుంది. వాస్తవానికి రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యుల సంఖ్యాబలం ఆధారంగా ఈ మూడు స్థానాలూ వైసీపీ సునాయ సంగా గెల్చుకుంటుంది. ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ప్రస్తుతం సభలో 151 మంది ఉన్నారు. దీంతో టీడీపీ తరపున ఎవరూ నామి నేషన్‌ దాఖలు చేయని పక్షంలో ముగ్గురు సభ్యులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, రఘునాథరెడ్డిలకు అభ్యర్థిత్వాలు ఖరారు చేయగా, వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేసేం దుకు ఇప్పటికే నామినేషన్‌ పత్రాలు తీసుకోవడం వైసీపీ నేతలను కలవర పరుస్తోంది. అయితే అభ్యర్థిని మాత్రం టీడీపీ ఇంకా ఖరారు చేయ లేదు. ఈనెల 15వ తేదీతో నామినేషన్ల దాఖలుకు చివరి గడువు. దీంతో వైసీపీ నేతల్లో, నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో అసలు టీడీపీ పోటీ చేస్తుందా ? లేదా ? అనేది తెలియక టెన్షన్‌ నెలకొంది. టీడీపీకి ప్రస్తుతం సభలో 18 మంది సభ్యుల బలం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన వైసీపీ నలుగురు శాసనసభ్యులపై చర్యలు తీసుకునే పనిలో స్పీకర్‌ ప్రస్తుతం కసరత్తు నిర్వహిస్తున్నారు. స్పీకర్‌ వారిపై చర్య తీసుకుంటే టీడీపీ దాదాపు 26 మంది వైసీపీ శాసనసభ్యుల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీలో 32 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యే లకు వచ్చే ఎన్నికల్లో సీట్లు గల్లంతయ్యాయి. వీరిలో చాలామంది బహిరంగం గానే వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్లగక్కారు. టీడీపీ పోటీ చేస్తే వీరందర్నీ కాపాడుకోవడానికి వైసీపీ నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే టీడీపీ పోటీ చేయని పక్షంలో ఈనెల 15వ తేదీకే ఎన్నికల ఫలితం తేలిపోతుంది. ఏకగ్రీవంగా వైసీపీ ముగ్గురు అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఈ నేపథ్యంలో టీడీపీ నిర్ణయం ఎలా ఉండబోతుం దన్న దానిపై ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలపై అధిష్ఠానం పూర్తి నిఘా ఉంచింది. టీడీపీ పోటీ చేసినా తమ సభ్యులు చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుం టోంది. ఇక టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపో యినా, ఒకవేళ పోటీ చేసి అభ్యర్థి ఓటమి చెందినా రాజ్యసభలో తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోనుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రాష్ట్ర కోటా ప్రకారం మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు పెద్దల సభలో ఆశీనులుకానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img