ముంబయి: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ఈవీ కేటగిరిలో విప్లవాన్ని సృష్టించింది. వివిధ మోడల్స్‌పై అనూహ్యంగా ధరలను తగ్గించింది. టాటా.ఈవీ ధరలు 1.2 లక్షల వరకు తగ్గాయి. భారత్‌లో అత్యంత గొప్ప ఫీచర్లు కలిగిన ఈవీగా గుర్తింపుపొందిన నెక్సాన్.ఈవీ ధర ఇప్పుడు రూ.14.49 లక్షలతోనూ, లాంగ్‌రేంజి నెక్సాన్.ఈవీ (465కి.మీ.) ధర ఇప్పుడు రూ.16.99 లక్షలతో, అత్యంత వేగవంతంగా అమ్మకాలు సాగిసుÊఱఉతన్న ఈవీ తియాగో. ఈవీ ధర ఇప్పుడు రూ.7.99 లక్షలతో ప్రారంభమవుతున్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈవీ ధరలను తగ్గించినట్లు టీపీఈఎం చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు.