Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డబ్ల్యూటీవో నుంచి వైదొలగాలి

. కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన రైతులు
. దేశవ్యాప్తంగా నిరసనోద్యమం
. జాతీయ రహదారుల వెంబడి ట్రాక్టర్లతో నిరసన

అమృత్‌సర్‌/హోషియాపూర్‌/హిస్సార్‌ : ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్‌ వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ రైతులు సోమవారం జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ఊరేగింపును ప్రారంభించారు. రైతు సంఘాల గొడుగు సంస్థ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆదివారం ఫిబ్రవరి 26న ‘క్విట్‌ డబ్ల్యూటీవో డే’ ను పాటించను న్నట్లు ప్రకటించింది. ఇది కొనసాగుతున్న రైతుల ఆందోళనలో డిమాండ్లలో ఒకటిగా ఉంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే, లుహర్లీ టోల్‌ ప్లాజా, మహామాయ ఫ్లైఓవర్‌ మీదుగా రైతులు ట్రాక్టర్లపై నిరసన కవాతుకు ప్రణాళిక చేశారు.
సోమవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు నిర్వహిస్తామని ప్రకటిం చారు. ఇందులో భాగంగా పంజాబ్‌, హర్యానాలోని అనేక చోట్ల హైవేలపై సోమవారం రైతులు తమ ట్రాక్టర్లను నిలిపారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కి చట్టపరమైన హామీ సహా వేర్వేరు డిమాండ్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వేలాది మంది రైతులు తమ ‘దిల్లీ చలో’ ప్రదర్శన తర్వాత హర్యానా, పంజాబ్‌ సరిహద్దులోని ఖనౌరీ, శంభు పాయింట్ల వద్ద బస చేసిన నేపథ్యంలో ఇది జరిగింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో, జలంధర్‌-జమ్మూ జాతీయ రహదారితో సహా అనేక ప్రాంతాల్లో రైతులు తమ ట్రాక్టర్లను నిలిపారు. దోబా కిసాన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జంగ్వీర్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో రైతులు తమ ట్రాక్టర్లను తాండాలోని బిజిలీ ఘర్‌ చౌక్‌ వద్ద రోడ్డుపై నిలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఒక సమావేశంలో చౌహాన్‌ ప్రసంగిస్తూ, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) విధానాలను విమర్శించారు. వారిని ‘రైతు వ్యతిరేకులు’గా అభివర్ణించారు. అలాగే, భారతీ కిసాన్‌ యూనియన్‌ (రాజెవాల్‌), బీకేయూ (ఖాడియన్‌), బీకేయూ (ఏక్తా ఉగ్రహన్‌) వంటి అనేక ఇతర వ్యవసాయ సంఘాల సభ్యులు కూడా ప్రదర్శనలు నిర్వహించారు. హోషియార్‌పూర్‌-ఫగ్వారా రోడ్‌, నస్రాలా-తారాగర్‌ రోడ్‌, దోసర్కా-ఫతేపూర్‌ రోడ్‌, బుల్లోవాల్‌అలోవల్‌ రోడ్‌, భుంగా-హరియానా రోడ్‌ల వెంబడి తమ ట్రాక్టర్లను నిలిపి నిరసన తెలిపారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులకు పింఛన్‌కు చట్టపరమైన హామీలు ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అమృత్‌సర్‌లో, అజ్నాలా, జండియాల గురు, రయ్యా, బియాస్‌లో తమ తమ వాహనాలను జాతీయ రహదారుల వెంబడి నిలిపారు. లూథియానాలో ఎస్‌కేఎంకు చెందిన రైతులు డబ్ల్యూటీవోకు వ్యతిరేకంగా లూథియానా-చండీగఢ్‌ రహదారిపై హైవే వెంట తమ ట్రాక్టర్లను నిలిపారు. హర్యానాలోని హిసార్‌లో రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి 50 చోట్ల రైతులు తమ ట్రాక్టర్లను నిలిపి నిరసనలు చేపట్టారు. సురేవాలా చౌక్‌, మయ్యార్‌ టోల్‌, చౌదరివాస్‌, బాగ్లా మోర్‌, బాదోపట్టి, బాస్‌ టోల్‌ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించినట్లు అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు షంషేర్‌ సింగ్‌ నంబర్దార్‌ తెలిపారు. డబ్ల్యూటీవో విధానాల వల్ల ప్రభుత్వం అన్ని పంటలకు ఎంఎస్‌పీ ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ‘భారత ప్రభుత్వం తన రైతులను రక్షించడానికి, జాతీయ ఆహార భద్రతను నిర్ధారించడానికి దేశం హక్కులను దృఢంగా రక్షించాలి’ అని ఎస్‌కేఎం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘డబ్ల్యూటీవో విధానం రైతులకు చాలా చెడ్డది. అది రైతులకు హక్కులు ఇవ్వదు’ అని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌ సింగ్‌ పంధర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూటీవో నుంచి బయకు రావాలని డిమాండ్‌ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల డిమాండ్లను , రైతులకు ఇచ్చిన హామీని మరచిపోకూడదనే ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టినట్లు సోమవారం రైతు నాయకుడు తికైత్‌ తెలిపారు. ‘మాకు ఇంకా ప్రభుత్వం నుంచి సందేశం రాలేదు. చర్చ కోసం ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. అందువల్ల ఎప్పుడు సమావేశం జరిగినా మేము హాజరవుతాము’ అని విలేకరుల సమావేశంలో ఒక రైతు నాయకుడు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. దిల్లీయూపీ సరిహద్దుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం
రైతుల ప్రతిపాదిత ట్రాక్టర్‌ మార్చ్‌ దృష్ట్యా సోమవారం దిల్లీఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. దిల్లీలోని పోలీసులు సరిహద్దుల్లో బారికేడ్లు వేసి తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో దిల్లీ నుంచి నోయిడా వైపు చిల్లా బోర్డర్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ ఏర్పడిరది. దిల్లీనోయిడా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద కూడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img