Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

ప్రజల మన్నలను పొందుతున్న సి పి ఐ అనంత అర్బన్ అభ్యర్థి సి. జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన ఇండియా కూటమి సిపిఐ అనంతపురం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థిగా సి జాఫర్ కు ఎన్నికల ప్రచారంలో భారీ ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతున్నారు. సిపిఐ అభ్యర్థిగా జాఫర్ ఎన్నికల గుర్తు కంకి కొడవలి గుర్తుకు మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గురువారం స్థానిక రెండవ డివిజన్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతపురం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి జాఫర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు దాదా గాంధీ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి రమణయ్య, అలిపిర, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయిస్వామి, సిపిఐ కల్పనా జోషి కాలనీ కార్యదర్శి ప్రసాద్,సిపిఐ జిల్లా సమితి సభ్యులు జయలక్ష్మి, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు వంశీ,నాయకులు హరి, సమీర్, విశ్వ,వెంకటేష్, మరియు సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ అభ్యర్థి జాఫర్ రెండో డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి కాంగ్రెస్ పార్టీలో పొందపరిచిన మేనిఫెస్టో వివరాలను తెలియజేస్తూ కంకి కొడవలి గుర్తుకు తమ ఓటు ద్వారా అసెంబ్లీలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img