Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

24 నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జరుగనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానంద రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ దేవానందరెడ్డితో కలసి అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులతో ఆన్‌లైన్‌ (వర్చువల్‌) మీటింగ్‌ నిర్వహించారు. పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 నుంచి వచ్చే నెల జూన్‌ 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,877 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్ధులను ఉదయం 8:45 నుంచి 9:30 మధ్యలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేలా 86 మంది ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులను పరీక్షా కేంద్రాలలోకి చేర్చడానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదుల కోసం 0866 2974540 ను సంప్రదించాలని కమిషనర్‌ తెలిపారు. 24వ తేదీ ఫస్ట్ట లాంగ్వేజ్‌, 25 సెకండ్‌ లాంగ్వేజ్‌, 27న థర్డ్‌ లాంగ్వేజ్‌, 28న గణితం, 29న ఫిజికల్‌ సెన్సు, 30న బయోలాజిక్‌ సైన్సు, 31న సోషల్‌, జూన్‌1,2 తేదీలలో ఓఎస్‌ఎస్‌సీ పేర్‌ 1, 2 పరీక్షలను నిర్వహించనున్నట్లు కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img