Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కౌంటింగ్ ను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పని చేయాలి


కౌంటింగ్ లో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైనది
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పని చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. సోమవారం అనంతపురం నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు – 2024 లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియపై సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. అందరూ సానుకూల మనస్తత్వంతో ఉండాలని, సజావుగా కౌంటింగ్ నిర్వహించాలన్నారు. ఎంతవరకు సిద్ధమైనా కౌంటింగ్ సమయంలో ఏదైనా సంఘటన జరగవచ్చని, ఇందుకు సన్నద్ధంగా ఉండాలని, ఏ రకమైన సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉత్తమ అధికారులను కౌంటింగ్ కోసం ఎంపిక చేయడం జరిగిందని, మీపై మీరు నమ్మకం ఉంచాలని, కౌంటింగ్ ని కంగారు పడకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి బ్లాక్ లోను రిజర్వ్ స్టాప్ కి ఒక గది కేటాయించడం జరుగుతుందని, అక్కడ వారు ఉంటారన్నారు. కౌంటింగ్ సిబ్బందికి కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి 07:30 గంటల వరకు బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకుని కౌంటింగ్ హాల్లోకి వెళ్లాలని, అందరికీ ఐడి కార్డులు ఉండాలన్నారు. 10 రౌండ్ల కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ సిబ్బందికి టి, స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందని, అనంతరం మళ్లీ వచ్చి కౌంటింగ్ కొనసాగిస్తారన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పై ఎవరూ మాట్లాడరాదని, అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కు అన్ని విధాల సన్నద్ధం కావాలని, ప్రతి అంశంపైన పూర్తి అవగాహన ఉండాలన్నారు.
ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు జాగ్రత్తగా కౌంటింగ్ ను నిర్వహించాలన్నారు. కౌంటింగ్ రోజు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, వెన్నెల శ్రీను, రాంభూపాల్ రెడ్డి, జి.వెంకటేష్, ఈఆర్ఓ శిరీష, నోడల్ అధికారులు రఘునాథరెడ్డి, బసవరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img