Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

ప్రభుత్వం కరువు సహాయ చర్యలు వెంటనే చేపట్టాలి… ఏపీ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.కాటమయ్య


విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లాలో 32 మండలాలు గాను కేవలం 21 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం తప్ప,కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. కాటమయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి. రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు రైతుల సమస్యలతో కూడిన వివరాల ను ఆర్డిఓ కార్యాలయంలోని డీఎవో రమేష్ బాబు కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం తూతూ మంత్రంగా కేవలం శ్రీ సత్య సాయి జిల్లాలో 32 మండలాలు గాను కేవలం 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం తప్ప, కరువు సహాయచరులు ఇంతవరకు ఎందుకు చేపట్టలేకపోయారని? వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత రబీ ఖరీఫ్ సీజన్లలో వర్షాలు లేక నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కావడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని రైతుల రుణాలు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు ఎరువులు కేవలం నామమాత్రంగా ఉన్నాయని,ఆ విధంగా కాకుండా రైతులుకి అవసరమైన విత్తనాలను ఎరువులను 90 శాతం సబ్సిడీతో అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్యాంకులలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి, కేవలం వడ్డీ మాత్రం జమ చేయించుకొని, రుణాలు ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా గతంలో ప్రభుత్వం నిర్వహించిన భూరి సర్వేను రద్దుచేసి, రైతుల పాస్ పుస్తకములలో ఉన్న కొలతల ప్రకారం రుణాలను రీ షెడ్యూల్ చేయాలని తెలిపారు.
రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వాలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కమతం కాటమయ్య- రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, కిరణ్ -మీటర్ రీడర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎన్. కుల్లాయప్ప- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు, గుర్రం వెంకటస్వామి- ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img