Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఏరువాక పౌర్ణమి… రైతుల పండుగ

–ఆత్మహత్యలు కాదు.. పోరాటమే మార్గం
–సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య
–వైభవంగా ఏరువాక పౌర్ణమి మహోత్సవం

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : నాగరికత ఎంత ముందుకు సాగిన నాగలి లేనిదే పని జరగదు.. రైతు లేనిదే పూట గడవదని అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి అని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోనే బిల్లేకల్లు గ్రామంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఏరువాక పౌర్ణమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఎద్దులను రైతులు అందంగా అలంకరించి పూజలు చేసి పొలాలకు తీసుకెళ్లారు. పొలాల్లో భూమి పూజ నిర్వహించి, నాగలితో పొలాల్లో దుక్కిదున్ని పంటలు వేసేందుకు శుభారంభం పలికారు. ఎద్దులకు పూజలు చేసి వ్యవసాయ పనులను సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య చేతులమీదుగా ప్రారంభించారు. ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి రంగన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులంతా ఆనందంగా ఉండాలని కోరుతూ ఏరువాక పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాన్ని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగలి కదలనిదే నాగరికతకు అర్ధం ఉండదని, రైతు లేనిదే రాజ్యంలేదని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వర్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోన, రాష్ట్రంలోనా ప్రజా వ్యతిరేక విధానాల అమలు, రైతు వేధింపులకు పాల్పడిన పాలక ప్రభుత్వాలు నేడు గడ్డు రోజులను ఎదుర్కున్నాయని గుర్తు చేశారు. రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ యంత్ర పరికరాలను 90 శాతం సబ్సిడీకే ఇవ్వాలని, రైతు రుణాలు మాఫీ చేసి కేరళ తరహాలో రైతు రుణ ఉపశమనం చట్టం చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, నిరంతర పోరాటమే మార్గమని స్పష్టం చేశారు. గ్రామాలవారీగా రైతులను సంఘటితం చేసి పోరాటంలో భాగస్వామ్యం చేస్తామన్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, రైతు సంఘం మండల సీనియర్ నాయకులు ఆంజనేయ, ఉరుకుందప్ప, లక్ష్మన్న, హనుమంతు, రైతు సంఘం మండల అధ్యక్షులు బడేసాబ్, ఆంజనేయ, రామాంజిని, సిపిఐ నాయకులు నాగేష్, హేమంత్, రామాంజిని, హనుమంతు ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మన్న, రమేష్, షఫీ, హరి, రామచంద్రలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img