London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

రాజధానిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల

రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే… జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.

అమరావతి పేరుకు అందరూ అంగీకరించారు

రామోజీరావు కూడా రీసెర్చ్ చేసి తనకు అమరావతి పేరునే సూచించారన్నారు. దీనికి కేబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టిని, దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు, మట్టిని తీసుకువచ్చామన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా యమునా నీటిని, మట్టిని తీసుకువచ్చారన్నారు. అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని… రాజధానికి సహకరిస్తామని చెప్పారన్నారు. అమరావతికి పార్లమెంట్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారన్నారు.

అమరావతి చరిత్ర సృష్టించే నగరమన్నారు. శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. అందుకే దీనిని రాజధానిగా నిర్ణయించినట్లు చెప్పారు. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు. కరడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తారన్నారు. బ్రిటిష్ మ్యూజియంలో అమరావతికి ఓ గ్యాలరీ ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img